
అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో తెరకెక్కుతున్న ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ఆడియోను మార్చి 8న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట. ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు. యువ సంగీత తరంగం దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. దేవి – త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కలయికలో వచ్చిన ‘జులాయి’ ఆడియో పెద్ద హిట్టయ్యింది. అల్లు అర్జున్ – దేవి శ్రీ, త్రివిక్రమ్ – దేవి శ్రీలది కూడా హిట్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా ఆడియోపై మంచి అంచనాలు ఉన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో జరుగుతుంది. అల్లు అర్జున్ సరసన సమంత, నిత్యా మీనన్, అదా శర్మలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, స్నేహ, ఉపేంద్ర, బ్రహ్మానందం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. హారిని & హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.