హీరోగా రాజేంద్ర ప్రసాద్ తనయుడి తెరంగేట్రం.

Balaji-Prasad-and-Rajendra-
హీరోగా మరో వారసుడు తెలుగు తెరపై అరంగేట్రం చేయడానికి రెడీ అవుతున్నాడు. ప్రముఖ సినీ నటుడు, ఒకప్పటి హీరో నట కిరీటి రాజేంద్ర ప్రసాద్ తనయుడు బాలాజీ ప్రసాద్ హీరోగా పరిచయం కాబోతున్నాడు. బాలాజీని హీరోగా పరిచయం చేసే బాధ్యత ప్రముఖ నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ తీసుకుంది. రామోజీ రావు నిర్మాత. దర్శకుడు, ఇతర టెక్నీషియన్ల వివరాలు త్వరలో వెల్లడించే అవకాశం ఉంది.

తండ్రి బాటలో నడుస్తూ సినీ రంగంలో ప్రవేశిస్తున్న బాలాజీ.. తండ్రిలా కామెడీ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తారా..? లేక కమర్షియల్ సినిమాల వైపు మొగ్గు చూపుతారా..? అనేది వేచి చూడాలి. ఇటివలే బాలాజీ వివాహం అయ్యింది. ఈ వివాహ వేడుకలకు సినీ రాజకీయ రంగ ప్రముఖులు హాజరయ్యారు.

క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారిన తర్వాత రాజేంద్ర ప్రసాద్ బాగా బిజీ అయ్యారు. అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు – కొరటాల శివ సినిమాలలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘టామీ’ అనే సినిమాలో ప్రధాన పాత్ర పోషించారు.

Exit mobile version