ఇప్పుడు మెగా అభిమానులు అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పెద్ది”. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న సాలిడ్ స్పోర్ట్స్ డ్రామా సినిమా ఇది కాగా మేకర్స్ రెండు వాయిదాలు తర్వాత మూడో రిలీజ్ సమయంగా జూన్ ని లాక్ చేశారు.
అయితే జూన్ లో రిలీజ్ ఎప్పుడు అనేది మాత్రం అభిమానుల్లో సస్పెన్స్ గా మారింది. జూన్ 4 లేదా 25 డేట్స్ లో ఏదోక తేదీలో వస్తుంది అని గట్టి బజ్ వినిపించగా ఇప్పుడు దీనిపై బిగ్ అప్డేట్ ని బుచ్చిబాబు సానా ఫైనల్ గా అందించారు. స్టార్ నటుడు ధనుష్ నటించిన ‘కర’ తెలుగు ప్రీరిలీజ్ ఈవెంట్ లో పెద్ది చిత్రం జూన్ 25న విడుదల కానుంది అని బిగ్ న్యూస్ రివీల్ చేయడం ఫ్యాన్స్ లో ఫైనల్ గా సస్పెన్స్ కి తెర దించేలా చేసింది.
సో జూన్ 25న రామ్ చరణ్, మెగా అభిమానుల రచ్చ నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుంది అని చెప్పేయవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా ఐటెం సాంగ్ షూట్ లో బిజీగా ఉండగా దీని తర్వాత అఫీషియల్ పోస్టర్ తో కొత్త తేదీ ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది. సో అప్పుడు వరకు ఆగాలి. ఇక ఈ సినిమాకి వృద్ధి సినిమాస్ నిర్మాణం వహిస్తున్నారు.
