పూరి జగన్నాధ్ @ బ్యాంకాక్..

puri
‘టెంపర్’ సినిమా ఘన విజయం సాధించింది. హీరో ఎన్టీఆర్ & దర్శకుడు పూరి జగన్నాధ్ లకు చాలా రోజుల నుండి అందని ద్రాక్షలా ఊరిస్తున్న విజయం దక్కింది. మరి ఇప్పుడు, దర్శకుడు పూరి జగన్నాధ్ ఎం చేస్తున్నారో తెలుసా..? ఎప్పటిలానే తనకు ఫేవరెట్ వర్కింగ్ & హాలిడే స్పాట్ బ్యాంకాక్ వెళ్ళిపోయారు. ప్రతి సినిమా విడుదలయిన తర్వాత బ్యాంకాక్ వెళ్ళడం పూరికి అలవాటు. అక్కడ తన తదుపరి సినిమాకు సంబందించిన వర్క్స్ స్క్రిప్ట్ వర్క్, డైలాగ్స్ రాయడం వంటివి పూర్తి చేస్తారు.

ప్రస్తుతం ‘జ్యోతిలక్ష్మి’ సినిమాకు బ్యాంకాక్ లో డైలాగ్స్ రాస్తున్నట్టు సమాచారం. ఛార్మి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ముహూర్త కార్యక్రమం ఇటివలే జరిగింది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నారు. సి.కళ్యాణ్ ఈ సినిమాకు నిర్మాత. డైలాగ్స్ రాయడంతో పాటు ఖాళి సమయాల్లో షాపింగ్ కూడా చేస్తూ.. రిలాక్స్ అవుతున్నారు పూరి.

Exit mobile version