
ప్రముఖ సినీ నటి శారద నిన్న మధ్యాహ్నం (06-03-2015) రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. హైద్రాబాద్ – విజయవాడ జాతీయ రహదారి మార్గంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే మునగాల ప్రాంతంలో శారద ప్రయాణిస్తోన్న కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో శారద బయటపడ్డారు. ఓ సినిమా షూటింగ్ పనుల నిమిత్తం విజయవాడ నుండి హైద్రాబద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
స్వల్ప గాయాలపాలైన ఆమె, ఆ తర్వాత మరో వాహనంలో హైద్రాబాద్ బయలుదేరారు. ఇదే ప్రాంతంలో గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నందమూరి హరికృష్ణ కుమారుడు జానికీరామ్ దుర్మరణం పాలైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జరిగిన ఈ ప్రమాదంతో సినీ పరిశ్రమ భయాందోళనలకు లోనయింది. అయితే.. నటి శారదా తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడడంతో పరిశ్రమ ఊపిరి పీల్చుకుంది.