‘జాదుగాడు’గా నాగ శౌర్య..?

Jadoogadu
సినిమాలో డిఫరెంట్ కాన్సెప్ట్ & వెరైటీ పబ్లిసిటీ ప్రస్తుతం యువ హీరోలు జపిస్తున్న మంత్రం ఇదే. నెలలో పదుల సంఖ్యలో విడుదలవుతున్న సినిమాల మధ్య తమకు ఓ గుర్తింపు, సినిమాకు వసూళ్లు రావాలంటే ఆ మాత్రం చేయక తప్పదు అంటున్నారు. హోలీ కానుకగా విడుదల ‘జాదుగాడు’ అనే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటివల ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. కేవలం కాళ్ళు మాత్రమే చూపిస్తున్న ఈ పోస్టర్లో హీరో ఎవరా అని ఆరా తీయడం మొదలుపెట్టారు.

ఆ ‘జాదుగాడు’ నాగ శౌర్య అని సమాచారం. ‘ఊహలు గుసగుసలాడే’, ‘దిక్కులు చూడకు రామయ్య, ‘లక్ష్మి రావే మా ఇంటికి’ సినిమాలలో ప్రేమికుడిగా నటించిన ఈ యువ హీరో, ‘జాదుగాడు’తో యాక్షన్ రూట్ లోకి ఎంటర్ అయ్యాడని సమాచారం. ‘చింతకాయల రవి’ ఫేం యోగి దర్శకత్వం వహించిన ఈ సినిమా వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Exit mobile version