టర్కీ వంటల్లో రామ్ చరణ్ స్పెషలిస్ట్ – ఉపాసన

ram-charan-upasana
మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్ అతి తక్కువ సమయంలో స్టార్ స్టేటస్ దక్కించుకున్నాడు. ఓ వైపు మెగా వారసుడు అనే ట్యాగ్ లైన్, కోట్లాది మంది అభిమానులు తనపై పెట్టుకున్న అంచనాలు అందుకోవాలనే తపన.. మరోవైపు షూటింగులు ఇతరాత్రా పనులు ఇలా చరణ్ పై ఎంతో ఒత్తిడి ఉంటుంది. చరణ్ అర్ధాంగి, అపోలో సంస్థల నిర్వహణలో కీలకంగా వ్యవహరిస్తున్న ఉపాసన కూడా చాలా బిజీ.

వర్క్ టెన్షన్స్ నుండి రిలీఫ్ కావడానికి వీరిద్దరూ ఎం చేస్తారో తెలుసా..? వంట చేస్తారు. పాక శాస్త్రంలో తమ ప్రతిభను బయట పెడతారు. రామ్ చరణ్ టర్కీ వంటలు వండడంలో స్పెషలిస్ట్. నేను అతనికి సహాయం చేస్తాను అని తాజాగా ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన చెప్పారు.

ప్రస్తుతం వీరిద్దరూ న్యూ డైట్ ఫాలో అవుతున్నారు. చరణ్ ఎం తింటే.. నేను కూడా అదే తింటున్నాను. స్నేహితులు అందరూ బరువు తగ్గానని చెప్తున్నారు. ఇంకా వెయిట్ చెక్ చేసుకోలేదు. అని ఉపాసన తెలిపారు.

Exit mobile version