మార్చి 13న తమిళ ‘శంకరాభరణం’..

Sankarabharanam
కళా తపస్వి కె విశ్వనాధ్ దర్శకత్వం వహించిన కళాత్మక దృశ్య కావ్యాల్లో ‘శంకరాభరణం’ ఒకటి. తెలుగులో 1980లో విడుదలైన ఈ సినిమా క్లాసికాల్ హిట్ గా నిలిచింది. మూడు దశాబ్దాల తర్వాత ఈ సినిమా తమిళంలో విడుదలవుతుంది. మార్చి 13న తమిళ ప్రేక్షకులకు ఈ సినిమాను చూసే అదృష్టం కలిగింది. డిజిటల్ రీమాస్టర్ వెర్షన్ ప్రింట్ తో అక్కడ విడుదల చేస్తున్నారు. శ్రీ శబరిగిరి వాసన్ మూవీస్ నిర్మాత.

జెవి సోమయాజులు, మంజు భార్గవి, చంద్ర మోహన్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను పూర్ణోదయా ఫిల్మ్స్ పతాకంపై ఏడిద నాగేశ్వర రావు నిర్మించారు. కెవి మహదేవన్ సంగీత దర్శకుడు. ఈ సినిమా పాటలకు ఇంకా ఆదరణ తగ్గలేదు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్య పాత్రధారుల అద్బుతమైన నటన, సంగీత సాహిత్య విలువల కల పాటలు, విశ్వనాధ్ దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాను విజయపధంలో నడిపించాయి. కథను నమ్మి ఇలాంటి సినిమాను తీసిన నిర్మాతను సైతం అభినందించాలి. అప్పట్లో ఈ సినిమాకు నాలుగు జాతీయ అవార్డులు, ఐదు నంది అవార్డులు వచ్చాయి.

Exit mobile version