
యువ హీరో నిఖిల్ నటించిన తాజా సినిమా ‘సూర్య వర్సెస్ సూర్య’ విమర్శకుల ప్రసంశలతో పాటు ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకుంది. తాము చేసిన ఈ విభిన్న ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపడానికి మూవీ యూనిట్ సక్సెస్ టూర్ ప్లాన్ చేశారు. నేడు రాయలసీమలో కాళహస్తి, తిరుపతి పరిసర ప్రాంతాల్లో గల థియేటర్లను సందర్శిస్తారు. అక్కడ అభిమానులతో హీరో నిఖిల్ & టీం సెల్ఫీలు తీసుకున్నారు. ఈ టూర్ కు నిఖిల్ సెల్ఫీ టూర్ అని నామకరణం చేయడం విశేషం.
ఈ సక్సెస్ టూర్లో హీరోయిన్ త్రిదా చౌదరి, దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని, కమెడియన్ వైవా హర్ష తదితరులు పాల్గొన్నారు. సోమవారం కూడా వసూళ్లు బాగున్నాయని హీరో నిఖిల్ తెలిపారు. అతని కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమా ‘సూర్య వర్సెస్ సూర్య’ అని ఈ రోజు ఉదయం జరిగిన సక్సెస్ మీట్లో నిర్మాత మల్కాపురం శివకుమార్ చెప్పారు.