
ప్రదీప్ నందన్, ఖెనిశ చంద్రన్, శ్రీధర్, అభినవ్ గోమటం, పూజ జవేరి, శివాజీ రాజ, ఉషశ్రీ, కేదార్ శంకర్ లు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘జగన్నాటకం’. ఈ సినిమాలో లీడ్ రోల్ చేస్తున్న ప్రదీప్ నందన్ దర్శకుడిగా కూడా చేస్తున్న ఈ సినిమా అదుఇఒని ఇటీవలే రిలీజ్ చేసారు. డ్రామా కమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 13న గ్రాండ్ గా రిలీజ్ అవ్వడానికి సిద్దమవుతోంది.
ఒక్క రోజు ఓనర్స్ ఇంట్లో లేక పోవడం వళ్ల తన జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నవి, అవి ఎందుకు జరిగాయి, ఎవరు చేశారు అన్న అంశం మీద చిత్రం నడుస్తుంది. ఈ చిత్రంలో డ్రామాతో పాటు ఆడియన్స్ ని థ్రిల్ చేసే థ్రిల్లింగ్ మొమెంట్స్ కూడా ఉంటాయని ఈ చిత్ర టీం చెబుతోంది. ఆది శేష రెడ్డి నిర్మించిన ఈ సినిమాకి అజయ్ అరసాడ మ్యూజిక్ డైరెక్టర్.