
హీరో నితిన్ సోదరి, నిర్మాత నిఖితా రెడ్డి వివాహం మార్చి 15న హైద్రాబాద్‌లో వైభవంగా జరగనుంది. ఇష్క్ సినిమా కంటే ముందు సరైన హిట్ కోసం ఎదురుచూస్తూన్న నితిన్.. తమ సొంత సంస్థ ద్వారా కొత్త పంథాలో సాగే స్క్రీన్‌ప్లేతో ఇష్క్ ద్వారా హిట్ కొట్టారు. ఆ సినిమాకు నిర్మాతగా వ్యవహిరించింది.. నిఖితా రెడ్డి. ఆ తర్వాత ఆ సంస్థ నిర్మించిన వరుస సినిమాలకు నిఖితాయే నిర్మాతగా ఉన్నారు. శ్రేష్ట మూవీస్ బ్యానర్‌పై ఆ సినిమాలను నిర్మించారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్‌ను తెలుగు తెరకు పరిచయం చేసే అవకాశాన్ని ఆ సంస్థ పొందింది.
నిఖితా రెడ్డి.. అఖిలేష్ రెడ్డిని ఈ నెల 15న వివాహమాడనున్నారు. పూర్తి ప్రైవేటు కార్యక్రమంగా ఈ వేడుకను నిర్వహించే సూచనలు కనిపిస్తున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల మధ్య వైభవంగా వేడుకను నిర్వహించే పనుల్లో నితిన్ నిమగ్నమయ్యారు.