అజిత్ సరసన శృతి హాసన్..?

Ajith-and-Shruthi-Ha
‘వీరం’ (తెలుగులో వీరుడోక్కడే) వంటి విజయవంతమైన సినిమా తర్వాత తమిళ స్టార్ హీరో అజిత్, దర్శకుడు శివ కలయికలో మరో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం శృతి హాసన్ ను సంప్రదించారని సమాచారం. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. బిందు మాధవి పేరు కూడా హీరోయిన్ల లిస్టులో వినిపిస్తుంది. మరి సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉంటుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది. ఏప్రిల్ నెలాఖరున ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.

తమిళంలో స్టార్ హీరోలైన ధనుష్, సూర్యల సరసన శృతి హాసన్ ఇప్పటికే నటించింది. మరో స్టార్ హీరో విజయ్ సరసన నటిస్తున్న ‘పులి’ సినిమా సెట్స్ పై ఉంది. అజిత్ సినిమాలో అవకాశం వస్తే ఆమె అగ్ర స్థానానికి చేరుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు – కొరటాల శివ సినిమాలో శృతినే హీరోయిన్. మరో మూడు హిందీ సినిమాలలో శృతి నటిస్తుంది. చాలా తెలివిగా సినిమాలను ఎంపిక చేసుకుంటూ మూడు భాషలను బాలన్స్ చేస్తుంది.

Exit mobile version