
తమన్నా, హన్సిక.. ఈ ఇద్దరు హీరోయిన్లూ అందం, నటన ద్వారా తమ ప్రతిభను నిరూపించుకున్నవారే! ఇద్దరూ పలు భాషల్లో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్నవారే! ఈ బిజీ లైఫ్లో ఎవరి పనుల్లో వాళ్ళు తేలిపోయి ఉండగా, ఒక చక్కటి సమయంలో ఫ్లైట్లో కలుసుకున్నారు. మాటాల్లో మునిగిపోయి హ్యాపీగా జర్నీ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ముద్దుముద్దుగా దిగిన ఓ సెల్ఫీని ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఈ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. కథానాయికలు తోటి నాయికల పట్ల ఈర్శ్య, అసూయతో రగిలిపోతుంటారని అనుకుంటాం కానీ.. వీరిద్దరూ ఇలా కలిసిపోవడం చూస్తూంటే అది కేవలం అబద్ధంగానే మిగిలి పోలేదూ?!