బన్నీ బర్త్‌డే కానుకగా.. సన్నాఫ్ సత్యమూర్తి?

So-Sathyamurthy
అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా.. సన్నాఫ్ సత్యమూర్తి. ఈనెల 15న ఆడియో విడుదల జరగనుంది. దేవీశ్రీ ప్రసాద్ తన మార్క్ మ్యూజిక్‌తో ఆకట్టుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ చూసిన తర్వాత అభిమానుల్లో అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. అల్లు అర్జున్ స్టైలిష్ గెటప్‌కు మంచి స్పందన వస్తోంది. సమంత, నిత్యామీనన్‌లు కూడా అందంతో ఆకట్టుకుంటున్నారు.

ఇక తాజా సమాచారం మేరకు, ఈ సినిమాను ఏప్రిల్ 8న విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అల్లు అర్జున్ పుట్టిన రోజు కూడా అదే రోజు కావడం విశేషం. బన్నీ పుట్టినరోజు కానుకగా సినిమాను విడుదల చేస్తారని తెలుస్తోంది. అయితే.. ఇప్పటివరకూ ప్రచారంలో ఉన్నట్లు సినిమాని ఏప్రిల్ 2నే విడుదల చేయాలనుకున్నా అది వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుపుకుంటోంది. ఇక తమ అభిమాన హీరో పుట్టినరోజునే సినిమా విడుదల అంటే.. అభిమానులకు అంతకన్నా ఏం కావాలి?

Exit mobile version