
‘మద్రాస్ కేఫ్’ సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన రాశి ఖన్నా, తన తరువాతి సినిమా ‘ఊహలు గుసగుసలాడే’తో తెలుగు తెరకు పరిచయమైంది. అందంతో పాటు అభినయంతోనూ ఆకట్టుకోవడంతో తెలుగులో మంచి మంచి ఆఫర్లను కొట్టేసింది. ప్రస్తుతం గోపీచంద్ ‘జిల్’, రవితేజ ‘బెంగాల్ టైగర్’ చిత్రాల్లో హీరోయిన్గా నటిస్తున్న రాశి, తాజాగా ఐటమ్ సాంగ్స్ పట్ల తన అభిప్రాయాన్ని తెలియజేసింది.
ఐటమ్ సాంగ్స్ చేయడానికి తనకే అభ్యంతరం లేదని తెలిపింది. మంచి ఆఫర్ వస్తే గనక ఐటమ్ సాంగ్స్‌లో నటించేందుకు సిద్ధమని చెప్పింది. ఐటమ్ సాంగ్స్ సినిమా విజయంలో పాత్ర పోషిస్తాయని, అందులో చేయడం ద్వారా తన డ్యాన్స్ ప్రతిభను కూడా చాటుకోవచ్చని రాశి చెప్పుకొచ్చింది.