
మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి మాలిక్ అలియాస్ కళ్యాణ్ కోడూరి.. ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాకు కళ్యాణ్ మ్యూజిక్ అందించాడు. గత ఏడాది ‘ఏం సందేహం లేదు’ అంటూ ‘ఊహలు గుసగుసలాడే’ సినిమాకి ఇచ్చిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయి. అలాగే గతంలో ‘అలా మొదలైంది’ లాంటి బ్లాక్ బస్టర్ కి కూడా మ్యూజిక్ అందించాడు. కళ్యాణ్ మాలికి ఫేమస్ మ్యూజిక్ కంపోజర్ ఎంఎం కీరవాణికి బ్రదర్. ఆయనతో కలిసి ఎన్నో సినిమాల బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి కళ్యాణి మాలిక్ పనిచేసాడు.
ఇలాంటి సూపర్ హిట్ సినిమాలకు మ్యూజిక్ అందించినా కళ్యాణి మాలిక్ చాలా లో ప్రొఫైల్ ని మెయిన్టెయిన్ చేస్తుంటాడు. దాంతో ఒక రూమర్ బయట తిరుగుతోంది. అదేమిటంటే కళ్యాణి మాలిక్ చాలా సెలక్టివ్ గా సినిమాలు ఎంచుకుంటాడని, అతను అందరితో కలిసి పనిచేయలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని మేము ఆయన ముందు ప్రస్తావించినప్పుడు నవ్వుతూ ‘అందులో అస్సలు నిజం లేదు. అనుకోకుండా నేను పలువురు డైరెక్టర్స్ తో మాత్రమే పనిచేస్తాననే వార్త ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కావట్లేదు. నేను అందరు టాలెంటెడ్ డైరెక్టర్స్ తో పనిచేయాలనుకుంటున్నాను. నేను కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్స్ కి వ్యతిరేఖిని కాదని’ ఆయన తెలిపాడు. ఇప్పటికే పలు సినిమాలతో మెప్పించిన కళ్యాణి మాలిక్ కి కమర్షియల్ గా మంచి హిట్ వస్తే మ్యూజిక్ డైరెక్టర్ గా అనదర్ లెవల్ కి వెళ్తాడు.