టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తోంది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ బాలీవుడ్ చిత్రం ‘ది ఇండియా స్టోరీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ తాజాగా ఓ సాలిడ్ అప్డేట్ అయితే ఇచ్చారు.
కెట్టన్ డికె దర్శకత్వంలో సాగర్ బి. షిండే నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 24, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఈ చిత్రాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు శ్రేయాస్ తల్పాడే కీలక పాత్రలో నటిస్తుండగా, మంగేష్ ధక్డే సంగీతాన్ని అందిస్తున్నాడు. సోషల్ మెసేజ్‌తో కూడిన ఈ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ముఖ్యంగా వ్యవసాయంలో రసాయనాల దుర్వినియోగం, పురుగుమందుల వినియోగం వల్ల తలెత్తుతున్న ప్రమాదకరమైన పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా కథాంశం సాగుతుంది. కేవలం ఒక కుటుంబం సమస్యగా మాత్రమే కాకుండా, ప్రజారోగ్యం మరియు భద్రతను ప్రభావితం చేస్తున్న పెద్ద సంక్షోభాన్ని ఈ చిత్రం హైలైట్ చేయనుంది. వ్యవస్థలోని లోపాలను ఎండగడుతూ, కఠినమైన నియంత్రణల అవసరాన్ని గుర్తుచేస్తూ సాగే ఈ ఇన్వెస్టిగేటివ్ డ్రామా ప్రేక్షకులను ఆలోచింపజేసేలా ఉండబోతోంది.
