
అల్లుడు శ్రీను సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజాగా తన కొత్త చిత్రం పనుల్లో నిమగ్నమయ్యాడు. అల్లుడు శ్రీను సినిమాలో సాయి సరసన ఐటమ్ సాంగ్‌కు జత కట్టిన తమన్నా, ఈసారి హీరోయిన్గా నటించనుంది. భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. 2012లో తమిళంలో విడుదలై మంచి విజయం సాధించిన ‘సుందరపాండ్యన్’ సినిమాకు రీమేక్‌గా కొత్త చిత్రం రూపొందనుంది. తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేస్తున్నారు.
భీమనేని శ్రీనివాసరావు గతంలో పలు తమిళ చిత్రాలను తెలుగులో రీమేక్ చేసి ఘన విజయాలను సాధించి పెట్టారు. ఇక తాజా సమాచారం మేరకు ఏప్రిల్ నెలలో ఈ సినిమా సెట్స్పైక్ వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.