శింబు సరసన ఛాన్స్ కొట్టేసిన దీక్ష సేథ్

Deeksha_seth-2
‘మన్మధ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న హీరో శింబు. శింబు కేవలం తన సినిమాలతో కాకుండా అప్పుడప్పుడు సింగర్ గా కూడా ఆకట్టుకున్నాడు. పోటుగాడు, బాద్షా సినిమాలలో తమన్ పాడిన సాంగ్స్ మంచి హిట్ అయ్యాయి. ‘7/జి బృందావన కాలనీ’, ‘ఆడువారి మాటలకు ఆర్థాలే వేరులే’ ఫేం సెల్వ రాఘవన్ తో శింబు తన తదుపరి సినిమా చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది.

ఈ సినిమాలో సింబు సరసన హీరోయిన్ గా దీక్ష సేథ్ ఛాన్స్ కొట్టేసిందని తమిళ వర్గాలు చెబుతున్నాయి. శింబు లాంటి స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేయడం వలన దీక్ష సేథ్ చాలా హ్యాపీగా ఉంది. దీక్ష సేథ్ గతంలో శింబు సరసన ‘వెట్టై మన్నన్’ సినిమాలో నటించింది. ఆ సినిమా ఇంకా రిలీజ్ కాలేదు. అప్పుడే శింబు సరసన దీక్ష సేథ్ మరో సినిమా కొట్టేసింది. అర్బన్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాని హీరో ధనుష్ నిర్మిస్తున్నాడు.

Exit mobile version