‘కిక్ 2’లో న్యూ కామెడీ టైమింగ్ తో ఆకట్టుకోనున్న రవితేజ

Kick2
‘కిక్’ సినిమా మాస్ మహారాజ రవితేజకి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇవ్వడమే కాకుండా తనలోని కొత్త యాంగిల్ ని చూపిన చిత్రం. ఈ సినిమాలో రవితేజ చేసిన కామెడీ పెద్ద హైలైట్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమాకి సీక్వెల్ గా ‘కిక్ 2’ రూపొందుతోంది. కిక్ కి దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డినే ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్.టి.అర్ ఆర్ట్స్ బ్యానర్ పై కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

ఈ చిత్ర టీం చెబుతున్న లేటెస్ట్ న్యూస్ ప్రకారం రవితేజ కిక్ 2 సినిమాతో మరోసారి కామెడీ టైమింగ్ పరంగా తనలోని కొత్త యాంగిల్ ని చూపనున్నాడు. అలాగే కిక్ 2 లో మానరిజమ్స్ కూడా సరికొత్తగా ఉంటాయని అంటున్నారు. ఈ సినిమాలో కూడా ఎంటర్ టైన్మెంట్ లెవల్స్ మరియు కాండీ హై రేంజ్ లో ఉండేలా సురేందర్ రెడ్డి ప్లాన్ చేసాడు. ఇలా రవితేజలోని మరో సరికొత్త కోణాన్ని చూపించనున్న కిక్ 2 సినిమా సమ్మర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా కనిపించనున్న ఈ సినిమాకి ఎస్ఎస్ తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version