‘ఓకే బంగారం’ రిలీజ్ డేట్ ఖరారైంది..!

ok-bangaram
విభిన్న, విలక్షణ, భావోద్వేగపూరిత సినిమాల ద్వారా దేశంలోని గొప్ప దర్శకుల్లో ఒకరుగా నిలిచారు.. మణిరత్నం. ఆయన సినిమాలన్నీ కొత్తగా దర్శకులవ్వాలనుకునే వారికి పాఠాలవుతాయి అనడంలో అతిశయోక్తి లేదు. అలాంటి దర్శకుడు గత కొంతకాలం నుంచి తనదైన ముద్ర వేసే సినిమా చేయలేకపోయారు.

ఇప్పుడు తాజాగా ‘మణిరత్నం ఇస్ బ్యాక్’ అన్న స్లోగన్ వినపడుతున్న నేపథ్యంలో వస్తోన్న చిత్రం.. ఓకే కన్మణి. తెలుగులో ‘ఓకే బంగారం’ పేరుతో ప్రముఖ నిర్మాత దిల్‌రాజు విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో ఏప్రిల్ 17న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఇక నిన్న విడుదలైన ఆడియోకు విపరీతమైన స్పందన వస్తోంది. చాలా కాలం తర్వాత రెహమాన్ మ్యాజిక్ బాగా పనిచేసిందనే కామెంట్ వినబడుతోంది. ఇప్పటికే ఈ సినిమా పట్ల అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

Exit mobile version