
అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల సూపర్‌హిట్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ‘S/O సత్యమూర్తి’. భారీ అంచనాల మధ్య నిన్న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ యాక్టింగ్‌కు, త్రివిక్రమ్ స్టైల్ మేకింగ్‌కు మంచి మార్కులు పడ్డాయి. ఇక భారీ ఎత్తున ఎక్కువ థియేటర్లలో విడుదలవ్వడం, సినిమాకు మంచి స్పందన రావడంతో ‘S/O సత్యమూర్తి’ మొదటి రోజు కలెక్షన్లను కుమ్మేసింది. సమంత, నిత్యామీనన్, అదాశర్మలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.
ఇక ఇప్పటివరకూ అందిన సమాచారం మేరకు మొదటి రోజు నైజాం ఏరియాలో ఈ సినిమా 3.15 కోట్ల షేర్ సాధించినట్లు తెలుస్తోంది. ఈ కలెక్షన్లతో అత్తారింటికి దారేది (3.28 కోట్లు) తర్వాత రెండో స్థానంలో ‘S/O సత్యమూర్తి’ నిలిచినట్లైందని ట్రేడ్ టాక్. నైజాం ఏరియాతో పాటు సీడెడ్, ఆంధ్రాలోని అన్ని జోన్లలో మొదటిరోజు సినిమాకు మంచి కలెక్షన్లు వచ్చాయని తెలుస్తోంది. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మంచి ప్లస్ పాయింట్‌గా చెప్పుకోవచ్చు. హారిక ఆన్డ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించారు.