గత ఏడాది ఇండియన్ సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమానే ధురంధర్ 1. రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ స్పై యాక్షన్ చిత్రం రికార్డులు తిరగరాసింది. పార్ట్ 1 గానే 1300 కోట్లకి పైగా గ్రాస్ ని రాబట్టిన ఈ సినిమా సింగిల్ భాషలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. అయితే ఈ సినిమా ఇప్పుడు మరోసారి బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఛాన్స్ ని పట్టుకుంది.
జపాన్ లో ఈ సినిమా విడుదల అయ్యేందుకు సిద్ధం అయ్యింది. మేకర్స్ ఈ సినిమాని ఈ జూలై 10న గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సిద్ధం చేశారు. అయితే మన సినిమాలు జపాన్ లో క్లిక్ అయితే ఎలాంటి లాంగ్ రన్ ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు ధురంధర్ కూడా అక్కడ ఈ మ్యాజిక్ చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే. ఇక్కడ ఫస్ట్ పార్ట్ క్లిక్ అయితే రెండో పార్ట్ ని కూడా విడుదల చేసే అవకాశం ఉంది.
