ప్రారంభానికి ముందే చిక్కుల్లో పడ్డ సూర్య ’24’

surya
తమిళంతో పాటు తెలుగులో కూడా స్టార్ హీరో ఇమేజ్ ఉన్న స్టార్ హీరో సూర్య ఇటీవలే తన తదుపరి సినిమా ‘మాస్’ షూటింగ్ ని పూర్తి చేసాడు. ఈ సినిమా తర్వాత తను చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ’24’. ఈ సినిమా రెండు రోజుల క్రితమే లాంచ్ అయ్యింది, కానీ లాంచ్ అయిన రెండవ రోజే ఈ సినిమా చిక్కులో పడింది. పాపులర్ బాలీవుడ్ స్టార్ అనీల్ కపూర్ లీగల్ అడ్వైజర్స్ అయిన నాయక్ అండ్ నాయక్ కంపెనీ వారు సూర్య 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ కి లీగల్ నోటీసులని పంపించారు. సూర్య మూవీ 24 టైటిల్ మరియు టైటిల్ లోగో అనిల్ కపూర్ చేస్తున్న హిందీ సీరిస్ 24 లోగో ఒకేలా ఉందని వాళ్ళు లీగల్ నోటీస్ ఇచ్చారు.

అనిల్ కపూర్ పాపులర్ ఇంగ్లీష్ టీవీ సీరీస్ యొక్క రైట్స్ ని తీసుకొని కలర్స్ టీవీ చానల్ లో 24 ద్వారా గత సంవత్సరం టెలికాస్ట్ చేసారు. అనిల్ కపూర్ ఫస్ట్ సీజన్ హిట్ అవ్వడంతో సెకండ్ సీజన్ చేసే పనిలో ఉన్నాడు. దాంతో సూర్య సినిమాపై లీగల్ నోటీసులని పంపించాడు. దాంతో సూర్య 24 సెట్స్ పైకి వెళ్ళకముందే చిక్కుల్లో పడింది. త్వరలోనే ఈ విషయాన్ని సూర్య టీం క్లియర్ చేస్తుందని భావిస్తున్నారు. మనం ఫేం విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేయనున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించనుంది. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

Exit mobile version