
దాదాపు రెండు సంవత్సరాల క్రితం వచ్చిన ‘జగన్ నిర్దోషి’ సినిమా గుర్తుందా.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో శివ. ప్రస్తుతం శివ తన రెండవ సినిమా ‘అనగనగా ఒకచిత్రం’తో రెడీ అవుతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. ఈ నెలాఖరు కల్లా సినిమా టాకీ పార్ట్ ని ఫినిష్ చేసే పనిలో ఉన్నారు. శివ తండ్రికి పద్మాలయా స్టూడియోస్ మరియు కృష్ణ గారితో అనుబంధం ఉండడం వలన మే 31న ఈ సినిమా ఆడియో ని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.
ప్రేమ కథా చిత్రమ్ కి దర్శకత్వం వహించిన సినిమాటోగ్రాఫర్ జె. ప్రభాకర్ రెడ్డి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. సీనియర్ యాక్టర్స్ అయిన జయప్రకాశ్ రెడ్డి, వెన్నెల కిషోర్, సాయాజీ షిండేలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. గోవర్శిని ఫిల్మ్స్ పతాకంపై కడాలి సుబ్బారావు – జె. ప్రభాకర్ రెడ్డి కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.