నందమూరి యంగ్ హీరో సరసన సోనాల్ చౌహాన్.?

Sonal-chohwan
చాలా రోజుల తర్వాత నందమూరి యంగ్ హీరో కళ్యాణ్ రామ్ పటాస్ సినిమాతో విజయం అందుకున్నాడు. ఈ సినిమా ఇచ్చిన నూతన ఉత్సాహంతో ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తన తదుపరి సినిమా ‘షేర్’ షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా విషయంలో తాజాగా కొన్ని మార్పులు చేర్పులు జరుగుతున్నాయని సమాచారం. ముఖ్యంగా ఈ సినిమా కోసం ఎంపిక చేసిన హీరోయిన్ ని మార్చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

ముందుగా ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ కి జోడీగా వన్య మిశ్రని హీరోయిన్ గా ఎంపిక చేసారు. కానీ లేటెస్ట్ న్యూస్ ప్రకారం వన్య మిశ్ర ప్లేస్ లో ‘లెజెండ్’ సినిమాతో పరిచయం అయిన సోనాల్ చౌహాన్ ని రీ ప్లేస్ చేసారని సమాచారం. ప్రస్తుతానికి ఈ విషయంలో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చాలా వరకూ షూటింగ్ అయిన తర్వాత ఇంత సడన్ గా హీరోయిన్ ని ఎందుకు మార్చారా.? అనే అనుమానం అందరిలో మొదలైంది, మరి ఈ విషయానికి సరైన సమాధానం తెలియాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే.. పటాస్ సినిమాలనే అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ ఉంటూనే ఓ డిఫరెంట్ పాయింట్ తో ఈ సినిమా ఉంటుందని ఈ చిత్ర టీం అంటోంది. కొమర వెంకటేష్ నిర్మిస్తున్న ఈ సినిమాకి మల్లికార్జున్ డైరెక్టర్.

Exit mobile version