
అలాంటి స్టార్ హీరోల నుంచి నేటి యంగ్ హీరోస్ లోని చాలా మందితో పనిచేసిన టాప్ డైరెక్టర్ దర్శకేంద్రుడు కె. రాఘవేంద్ర రావు. ఇప్పటి వరకూ దర్శకుడిగా, నిర్మాతగా ఎక్కువగా సినీ పరిశ్రమకే అంకితమై ఉన్న రాఘవేంద్ర రావు తాజాగా మరో బాధ్యతను కూడా స్వీకరించాడు. ఇక నుంచి ఆయన శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నీదానంలో టిటిడిలో తన సేవలను అందించనున్నాడు. రాఘవేంద్ర రావు తాజాగా టిటిడి అధికారిక బృందం లో ఒక మెంబర్ అయ్యారు. ఈ విషయాన్ని ప్రస్తుతం అధికారంలో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టీస్ సమక్షంలో అధికారికంగా అనౌన్స్ చేసింది.
చైర్మన్ తో కలుపుకొని 18 మంది మెంబర్స్ ఉండే ఈ టిటిడి బోర్డులో రాఘవేంద్ర రావు కూడా ఒకరు. ఈ 18 మందికి ఒక సంవత్సరం పాటు స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఎప్పటి నుంచో రాఘవేంద్ర రావుకి టిటిడితో సత్సంబందాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. కావున ఈ వార్త పలువురిని పెద్ద షాక్ కి గురి చేయలేదు. టిటిడి బోర్డ్ మెంబర్స్ లో ఒకరిగా ఎలెక్ట్ అయిన సందర్భంగా రాఘవేంద్ర రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.