డా. మోహన్ బాబు నట వారసురాలిగా గుర్తింపు తెచ్చుకున్న మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో నటించి, నిర్మించిన సినిమా ‘దొంగాట’. అడవి శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో మంచు లక్ష్మీ ఆన్ స్క్రీన్ ఒక స్టార్ హీరోయిన్ గా కనిపించనుంది. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ‘యు/ఏ’ సర్టిఫికేట్ అందుకున్న ఈ సినిమాని మే 1న రిలీజ్ చెయ్యడానికి ఈ చిత్ర టీం ప్లాన్ చేసింది. కానీ తాజాగా ఈ చిత్ర టీం మే 1 రిలీజ్ రేసు నుంచి తప్పుకుంది.
మే 1న రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడం మరియు దొంగాట టీం ప్రమోషన్స్ కోసం ఇంకాస్త టైం తీసుకోవడమే ఈ సినిమా వెనక్కి వెళ్ళడానికి కారణం అని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ద్వారా వంశీ కృష్ణ అనే కొత్త దర్శకుడు సినీ పరిశ్రమకు పరిచయం కానున్నాడు. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర హైలైట్ కానుందని సమాచారం. అంతే కాకుండా తెలుగులోని పలువురు స్టార్ హీరోస్ అంతా కలిసి ఈ సినిమాలోని ఓ పాటలో నటించారు. ఆ సాంగ్ అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంటుందని అంటున్నారు.
