
ప్రముఖ నటుడు మరియు హిందూపూర్ ఎం.ఎల్.ఏ నందమూరి బాలకృష్ణ ఈ జూలైలో నార్త్ అమెరికా తెలుగు సొసైటీ వారి నాలుగవ సాంప్రదాయ సభకు హాజరుకానున్నాడు. ఈ సభ 2నుండి 4వరకూ లాస్ ఏంజెల్స్ లో జరగనుంది. దీనికి బాలకృష్ణని ముఖ్యఅతిధిగా ఆహ్వానించారు.
బాలకృష్ణతో పాటు ఈ కార్యక్రమానికి పలువురు సినీ తారలు మరియు రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. వారిలో కాజల్ అగర్వాల్, నాని, వెంకయ్య నాయుడు, హరీష్ రావు, కె.కవిత, జి.ఎం.ఆర్, గణపతి సచ్చిదానంద స్వామి తదితరులు వున్నారు. వివిధ ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలతో మూడు రోజులు ప్లాన్ చేసారు.
ప్రస్తుతం బాలకృష్ణ నటించిన ‘లయన్’ సినిమా వచ్చేనెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది.