ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూర్తి స్థాయి హీరోగా పరిచయమవుతోన్న చిత్రం ‘ఆంధ్రాపోరి’. ప్రతిష్టాత్మక ప్రసాద్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మించబడ్డ ఈ సినిమాకు ‘ఋషి’ సినిమా ఫేం రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించారు. ఉల్కా గుప్తా హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. జ్యోసభట్ల శర్మ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆడియోను మొదట మే 2న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు.
కాగా తాజాగా ఈ రిలీజ్ డేట్‌ను వాయిదా వేశారు. సినిమా యూనిట్ అందించిన వివరాల ప్రకారం కొత్త రిలీజ్ డేట్‌ను మే 7కు ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఆడియో ఆవిష్కరణకు నెలరోజుల ముందు నుంచే ఒక్కోరోజు ఒక్కో కాంటెస్ట్ పెడుతూ సరికొత్త ప్రచారానికి తెరతీసిన విషయం తెలిసిందే. ఇక నిన్నే పూరీ జగన్నాథ్ చేతుల మీదుగా విడుదలైన దేత్తడి పాటకు మంచి స్పందన వస్తోంది. మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘టైమ్‌పాస్’ సినిమాకు రీమేకే ఈ ‘ఆంధ్రాపోరి’. మే 15న ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.
