విడుదల తేదీ : మే 1, 2026
123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5
నటీనటులు : రితేష్ దేశ్‌ముఖ్, జెనీలియా దేశ్‌ముఖ్, సంజయ్ దత్, అభిషేక్ బచ్చన్, భాగ్యశ్రీ, విద్యా బాలన్ తదితరులు
దర్శకత్వం : రితేష్ దేశ్‌ముఖ్
నిర్మాతలు : జెనీలియా దేశ్‌ముఖ్, జ్యోతి దేశ్ పాండే
సంగీతం : అజయ్-అతుల్
సినిమాటోగ్రఫీ : సంతోష్ శివన్
ఎడిటర్ : ఊర్వశి సక్సేనా
సంబంధిత లింక్స్ : ట్రైలర్
మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రితేష్ దేశ్‌ముఖ్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘రాజా శివాజీ’. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా నేడు థియేటర్స్ లో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ:
ఈ సినిమా శివాజీ మహారాజ్ (రితేష్ దేశ్‌ముఖ్) స్వరాజ్య స్థాపన కోసం చేసిన పోరాటాన్ని చూపిస్తుంది. మొఘల్ సామ్రాజ్యం మరియు ఆదిల్ షాహీ బలగాలను ఎదుర్కోవడానికి ఆయన అనుసరించిన గెరిల్లా వ్యూహాలు, అఫ్జల్ ఖాన్‌తో (సంజయ్ దత్) జరిగిన చారిత్రాత్మక యుద్ధం, వంటి అంశాలతో ఈ చిత్రం సాగుతుంది.
ప్లస్ పాయింట్స్:
శివాజీ పాత్రలో రితేష్ దేశ్‌ముఖ్ పరకాయ ప్రవేశం చేశారు. ఆయన గంభీరమైన నటన, డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రాణం పోశాయి. సంజయ్ దత్ అఫ్జల్ ఖాన్‌గా తన క్రూరమైన నటనతో భయపెట్టారు. జిజాబాయిగా భాగ్యశ్రీ నటన ఆకట్టుకుంటుంది.
సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ సినిమాకు హైలైట్. ప్రతి ఫ్రేమ్ ఒక విజువల్ వండర్ లా ఉంది. అజయ్-అతుల్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యుద్ధ సన్నివేశాల్లో గూస్బంప్స్ తెప్పిస్తుంది.
యాక్షన్ సీక్వెన్స్‌లు చాలా సహజంగా, భారీ స్థాయిలో చిత్రీకరించారు. ముఖ్యంగా అఫ్జల్ ఖాన్‌తో జరిగే ఎపిసోడ్ సెకండాఫ్ లో కీలకంగా నిలుస్తుంది.
మైనస్ పాయింట్స్:
ఈ సినిమాకు ప్రధాన అడ్డంకి రన్ టైం. సుమారు 3 గంటలకు పైగా నిడివి ప్రేక్షకులకు కాస్త భారంగా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలు మరీ నెమ్మదిగా సాగడం వల్ల ఫ్లో దెబ్బతింది.
ఈ సినిమాను మరాఠీలో రూపొందించడం తో హిందీలో చూసినా డబ్బింగ్ డిఫెక్ట్స్ కనిపిస్తాయి. కొన్ని మరాఠీ డైలాగ్స్ వాడటం మైనస్.
ఫస్ట్ హాఫ్ కథను ముందుకు తీసుకెళ్లిన తీరు ఎంత బాగుందో.. సెకండ్ హాఫ్ లో కొన్ని సీన్స్ అంత నెమ్మదించాయి. ఇవి కథ ఫ్లో కు అడ్డుగా మారాయి.
సాంకేతిక విభాగం:
దర్శకుడిగా రితేష్ దేశ్‌ముఖ్ తన విజన్‌ను తెరపైకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. మేకింగ్ పరంగా ఎలాంటి తప్పులు చేయలేదు. జెనీలియా నిర్మాణ విలువలు అద్భుతం. ఎడిటర్ ఊర్వశి సక్సేనా సెకండాఫ్ లో కొన్ని సీన్లను ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత వేగంగా ఉండేది. అజయ్ – అతుల్ బీజీఎం ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్ళింది.
తీర్పు:
ఓవరాల్ గా చుస్తే.. ‘రాజా శివాజీ’ ఒక అద్భుతమైన విజువల్ ఎపిక్. రితేష్ దేశ్‌ముఖ్ నటన మరియు సంతోష్ శివన్ విజువల్స్ సినిమాను నిలబెట్టాయి. అయితే, సాగదీసిన కథనం మరియు సెకండ్ హాఫ్ లోని స్లో పేస్ సినిమాకు మైనస్. చారిత్రాత్మక చిత్రాలను, భారీ యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు ఈ చిత్రాన్ని ఒకసారి ట్రై చేయవచ్చు.
123telugu.com Rating: 2.75/5
Reviewed by 123telugu Team
