
కార్తికేయ సిద్దార్థ్ ని హీరోగా పరిచయం చేస్తూ బలరాం ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మాత బొమ్మిశెట్టి బలరాం ప్రసాద్ నిర్మిస్తున్న ‘శీనుగాడు కేక’. పరకోటి బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు మొదలైంది. నిర్మాత బలరాం ఈ సినిమా గురించి మాట్లాడుతూ ‘బాలాజీ దర్శకత్వంలో ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. 3 షెడ్యూల్స్ లో భారీగా ఈ మూవీని నిర్మించనున్నాం. కథ మీద ఉన్న నమ్మకంతో ఖర్చుకు వెనకాడకుండా అద్భుతంగా చిత్రీకరిస్తామని’ తెలిపాడు.
డైరెక్టర్ బాలాజి మాట్లాడుతూ ‘నేను చేస్తున్న 9వ మూవీ ఇది అందుకే ఈ సారి కచ్చితంగా సూపర్ హిట్ కొట్టాలని సూపర్బ్ స్టోరీని రెడీ చేసాం. హీరో కార్తికేయ సిద్దార్థ ఈ సినిమా కోసం బొంబాయిలో స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నాడని’ అన్నాడు. రీనా హీరోయిన్ గా నటించనున్న ఈ సినిమాలో పలువురు ప్రముఖ నటీనటులు నటించనున్నారు.