బాలయ్య లాంటి హీరోను ఎక్కడా చూడలేదు : త్రిష

Trisha
తన అందంతో, అభినయంతో తెలుగుతో పాటు తమిళ, హిందీ అభిమానులను సైతం కట్టిపడేసిన హీరోయిన్ త్రిష. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్‌ అయినా ఐదారేళ్ళకు మించి హీరోయిన్‌గా కొనసాగే అవకాశంలేనంత పోటీ ఉన్న నేపథ్యంలోనూ పదమూడేళ్ళు హీరోయిన్‌గా నిలబడి అభిమానాన్ని సంపాదించించి త్రిష. తాజాగా ఆమె నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన ‘లయన్’ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ‘లెజెండ్’ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బాలయ్య హీరోగా తెరకెక్కిన ఈ సినిమా మే 8న విడుదలకు సిద్ధమైంది.

ఇక ‘లయన్’ సినిమా విశేషాల గురించి చెబుతూ త్రిష బాలకృష్ణను పొగడ్తలతో ముంచెత్తింది. “బాలయ్యతో కలిసి నటించాలని ఎప్పుట్నుంచో అనుకునేదాన్ని. మొత్తానికి ఇప్పటికది వర్కవుట్ అయింది. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘లయన్’ సినిమాలో బాలయ్య చాలా ఎనర్జీతో నటించారు. 100 సినిమాలకు దగ్గరైన ఓ హీరో ఇప్పటికీ అంతే హుషారుగా పనిచేయడం ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ విషయంలో బాలయ్య లాంటి వ్యక్తిని ఇప్పటివరకూ ఎక్కడా చూడలేదు.” అని తెలిపింది త్రిష. ఇక నేడు తన పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంగా త్రిషకు 123తెలుగు తరపున శుభాకాంక్షలు.

Exit mobile version