
గత ఏడాది ‘చందమామ కథలు’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన డైరెక్టర్ ప్రవీణ్ సత్తారుకి విమర్శకుల నుంచి మంచి ప్రశంశలు రావడమే కాకుండా, నేషనల్ స్థాయిలో గుర్తింపు తెచ్చే ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ అవార్డుతో ప్రవీణ్ సత్తారుకి నూతన ఉత్సాహం లభించడమే కాకుండా కచ్చితంగా ఈ సినిమాకి సీక్వెల్ చేస్తానని కూడా తెలియజేశాడు. ఇది పక్కన పెడితే.. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు తన తదుపరి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు.
ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ని ఫినిష్ చేసిన ప్రవీణ్ సత్తారు, ప్రస్తుతం తన సినిమాకి కావాల్సిన నటీనటుల్ని ఎంపిక చేసే పనిలో ఉన్నాడు. అందులో ముందుగా హీరోయిన్ గా అందాల భామ మధు శాలినిని ఫైనలైజ్ చేసారు. మధుశాలిని తెలుగులో ఇప్పటికే చాలా సినిమాల్లో కనిపించి తెలుగు ప్రేక్షకులను మెప్పించింది. మధు శాలిని చివరిగా పవన్ కళ్యాణ్ – వెంకటేష్ కలిసి నటించిన ‘గోపాల గోపాల’ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించింది. అది కాకుండా ప్రస్తుతం సీతావలోకనం సినిమాలో కూడా నటిస్తోంది. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న ప్రవీణ్ సత్తారు – మధు శాలిని మూవీ పూర్తి వివరాలను త్వరలోనే అధికారికంగా అనౌన్స్ చేయనున్నారు.