జైలు గోడల మధ్యకి సల్మాన్ ఖాన్

salman-khan

బాలీవుడ్ బాక్స్ ఆఫీసుని గత కొన్నేళ్లుగా షేక్ చేస్తున్న బాలీవుడ్ కింగ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కి, అతని అభిమానులు జీర్ణించుకోలేని బాధాకరమైన విషయం ఈ రోజు చోటు చేసుకుంది. 2002 సెప్టెంబర్ 28న తను మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేసి వెళ్ళిపోయారు. ఆ యాక్సిడెంట్ వలన ఒకరు మృతి చెందగా నలుగురు గాయాలపాలయ్యారు. గత 13 ఏళ్ళుగా సల్మాన్ ని వెంటాడుతున్నఈ హిట్ అండ్ రన్ కేసు అనుకున్నట్టుగానే తన మెడకు బలంగా చుట్టుకుంది. ఈ కేసుపై ఈ రోజు ముంబై సెషన్స్ కోర్టు అంతిమ నిర్ణయాన్ని వెలువరించింది.

ఈ రోజు ముంబై సెషన్స్ కోర్టులో అంతిమ నిర్ణయంలో ‘హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ ని దోషిగా నిర్దారించింది. ఆ యాక్సిడెంట్ సమయంలో అతనే తాగి డ్రైవింగ్ చేస్తున్నాడని కోర్టు ఖరారు చేసింది. అలాగే తన డ్రైవర్ నడిపాడు అని అపద్దపు సాక్షాలను కోర్టుకు ఇచ్చాడు. ఇది కూడా నేరం. సల్మాన్ పై మోపిన అభియోగాలన్నీ ఋజువయ్యాయని’ కోర్టు తెలియజేసింది. దోషిగా నిర్దారణ అయిన సల్మాన్ ఖాన్ కి సుమారు 10 ఏళ్ళు లేదా 5 ఏళ్ళు శిక్ష పడుతుందని అంటున్నారు. త్వరలోనే ఆయన పై నిర్దారణ అయిన అభియోగానికి శిక్షని ఖరారు చేస్తారు. ఇక ఎం చేసినా సల్మాన్ ఖాన్ జైలు గోడల మధ్యకి వెళ్ళడం మాత్రం తప్పని సరి. ఈ వార్తా బాలీవుడ్ వర్గాలను, సలమాన్ ఖాన్ అభిమానులను తీవ్రమైన బాధకి లోను చేసింది.

Exit mobile version