‘సింగం 123’లో ఎవరినీ కించపరచలేదు : మంచు విష్ణు

manchu-vishnu

‘రేసులో నన్ను అందుకోడానికి నేను రేసుగుర్రాన్ని కాదు.. రెడ్‌బుల్ తాగిన సింహాన్ని రా..’ అంటూ ‘సింగం 123’ టీజర్ డైలాగులతోనే కేక పుట్టించిన సినీ పరిశ్రమ కొత్త సెన్సేషన్ సంపూర్ణేష్ బాబు, ట్రైలర్ ద్వారా మరోసారి రెచ్చిపోయారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను, ఆడియోను ఈమధ్యే విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్‌లోని కొన్ని డైలాగులు కొందరు స్టార్ హీరోలను టార్గెట్ చేసినట్టు ఉన్నాయనే వాదన వినిపించింది.

ఈ విషయంపై మంచు విష్ణు ఓ క్లారిటీ ఇచ్చారు. “సింగం 123 ఒక ఔట్ అన్డ్ ఔట్ కామెడీ షో. ఎవరినో కించపరచాలన్న ఆలోచనలో ఈ సినిమా చేయలేదు. సరదాగా ప్రేక్షకుడు నవ్వుకోడానికే ఈ ప్రయత్నం చేశాం. అభిమానులు అర్థం చేసుకుంటారనుకుంటున్నా” కొత్త దర్శకుడు అక్షత్ అజయ్ శర్మ తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే దాదాపుగా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెలాఖర్లో విడుదల కానుంది.

Exit mobile version