స్టార్ డైరెక్టర్ తో మరోసారి పనిచేస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేస్తున్న నాగచైతన్య

Naga-Chaitanyas-first-look
దర్శకుడు గౌతం మీనన్ నైపుణ్యంతో 2010లో ‘ఏం మాయ చేశావే’ సినిమా తో మొదటి బ్లాక్ బస్టర్ ని అందుకున్న నటుడు నాగ చైతన్య. ఈ సినిమాలో చైతు, సమంతాల నడుమ కుదిరిన కెమిస్ట్రీ కారణంగానే చిత్రం అంత విజయం సాధించింది. నాగచైతన్య, సమంతాల కెరీర్ లో మరపురాని చిత్రంగా నిలిచిపోతుంది అనడంలో సందేహం లేదు.

ఇప్పుడు దాదాపు ఐదేళ్ళ తరువాత నాగ చైతన్య, గౌతంమీనన్ కలిసి మరోసారి పనిచేయనున్నారు. చెన్నైలో మొదటి షెడ్యూల్ ప్రారంభమైంది. హీరోయిన్ ఇంకా ఖరారు కాలేదు. గౌతం మీనన్ తో పనిచేయడానికి చైతు ఎంతో ఉత్సాహం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా ఈ యువ అక్కినేని వారసుడే సోషల్ నెట్వర్కింగ్ ద్వారా తెలిపాడు.

Exit mobile version