‘ఆటోజానీ’లో చిన్న గెస్ట్‌రోల్ దొరికినా చేస్తా : చెర్రీ

Ramcharan
మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అభిమానుల ఎదురుచూపులకు తెరపడిన విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో చిరు 150వ సినిమా ఉంటుందన్న విషయాన్ని ఈ సినిమాను నిర్మించనున్న రామ్ చరణ్ ఇప్పటికే తెలియజేశారు. బీవీఎస్ రవి ఈ సినిమాకు స్క్రిప్ట్ సమకూరుస్తున్నారు. ఈ సినిమా విషయంలో రామ్ చరణ్ చాలా ఎగ్జైటింగ్‌గా ఉండడంతో పాటు సినిమాను అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా రూపొందించడానికి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

తాజాగా ఈ సినిమా విషయమై రామ్ చరణ్ మాట్లాడుతూ తన ఆనందాన్ని వెలిబుచ్చారు. “నాన్న 150వ సినిమా కోసం మంచి స్క్రిప్ట్ రెడీ చేశాం. అన్ని కమర్షియల్ హంగులు ఉంటూనే ఫ్యామిలీ అంశాలు మెండుగా ఉంటాయి. పూరీ జగన్నాథ్ కచ్చితంగా అందరినీ మెప్పిస్తారు. ఇక ఈ సినిమాలో నాకైతే ఓ చిన్న గెస్ట్ రోల్ ఉన్నా వెంటనే చేసేస్తా” అంటూ చిరు సినిమాపై తన భావాలను పంచుకున్నారు చెర్రీ. చిరు పుట్టినరోజైన ఆగష్టు 22న ఈ సినిమాను లాంచ్ చేయనున్న విషయం తెలిసిందే.

Exit mobile version