అందరినోటా సంపూ ‘సింగం 123’ డైలాగ్స్

singham123
‘నేను కత్తి పట్టి నరకడం మొదలు పెడితే ముక్కలు ఏరుకోవడానికి క్రొక్లైనర్లు రావాలి, రక్తం పారడానికి డ్రైనేజ్ లు తవ్వాలి’ అనే డైలాగ్ తో గత ఏడాది యు ట్యూబ్ లో ట్రెండ్ సెట్ చేసిన హీరో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు. ఈ ఏడాది అప్పుడే తన కొత్త సినిమా ‘సింగం 123’తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా ఆడియోతో పాటు థియేటర్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేసారు. విడుదలైన రోజు నుంచే ఈ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. రెస్పాన్స్ మాత్రమే కాకుండా ట్రైలర్ లో సంపూ చెప్పిన డైలాగ్స్ కి ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

‘ప్రెజర్ చేస్తే లొంగిపోవడానికి నేను ప్రెజర్ కుక్కర్ లో పప్పుని కాదు, గ్యాస్ స్టవ్ మీద నిప్పుని’
‘పేరు గోత్రం చెప్పడానికి నేనేమన్నా గుడికొచ్చానట్రా..’
‘నీకు మెంటల్ రావాలేమో.. నాకు 365 డేస్ ఆన్ లో ఉంటుంది’
‘యముడికి రెస్త్ ఉండదని ఎన్ కౌంటర్స్ ఆపేసా.. రీ స్టార్ట్ చెయ్యనివ్వకు’
‘బ్రతకండ్రా బ్రతకండ్రా అని బ్రతిమలాడితే వినరెంట్రా.. కోట మొదలైంది.. ఇక మీరు వెళ్ళేది ఐసియూల్లోకి కాడి ఐస్ బాక్సుల్లోకి’

అని చెప్పిన సంపూ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ కి అద్భుతమైన స్పందన రావడమే కాకుండా అందరినోటా అవే డైలాగ్స్ వినిపిస్తున్నాయి. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ సినిమాని నిర్మించడమే కాకుండా కథ – స్క్రీన్ ప్లే ని కూడా అందించాడు. శేషు మ్యూజిక్ అందించిన ఈ సినిమా ద్వారా అక్షత్ వర్మ దర్శకుడిగా పరిచయం కానున్నాడు. మే చివర్లో లేదా జూన్ మొదట్లో ఈ సినిమాని రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

Exit mobile version