పైరసీని అరికట్టేందుకు ‘పండగ చేస్కో’ బృందం కొత్త వ్యూహాలు

Pandaga-Chesko-Review-image

ఎంతో కష్టపడి తెరకెక్కించిన సినిమాలు విడుదలైన రోజునే పైరసీ బారినపడి భారీగా నష్టపోవడం టాలీవుడ్ లో గతకొంతకాలంగా జరుగుతున్న విషయమే. సినీ ప్రముఖులంతా పైరసీలో చూడద్దని మొత్తుకుంటున్నా ఈ భూతం టాలీవుడ్ ని వదలడంలేదు.

అయితే ఈ పైరసీని నివారించే క్రమంలో రామ్ నటించిన ‘పండగ చేస్కో’ టీం ఒక కొత్త పధకాన్ని అమలుచేశారు. ‘పండగ చేస్కో’ చిత్రంపెరుతో కొన్ని ఫేక్ లింక్స్ ని తామే ఇంటర్నెట్ లోకి అప్ లోడ్ చేసారు. వీటిని డౌన్ లోడ్ చేసుకుంటే ఒక వైరస్ వారి సిస్టంకి పట్టేలా ప్రోగ్రాం రాసుకున్నారు. ఒకరకంగా ఇది మంచి ఆలోచనే.

ఈ సినిమా సోమవారం కూడా మంచి కలెక్షన్ లతో దూసుకుపోతుంది. చిత్ర విజయంతో గోపీచంద్ మలినేని మరోసారి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. సోనాల్ చౌహాన్, రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటించారు.

Exit mobile version