లింగాని స్పూఫ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు

Linga
గత ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ జన్మదినం సందర్భంగా విడుదలైన లింగా చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర బోర్లా పడింది. సినిమా కనీసం రజినీ ప్రేక్షకులకు సైతం రుచించకపోవడం గమనార్హం. ఎన్నోసార్లు ఫ్లాపులు చవిచూసిన రజినీ ఈ సినిమా రిజల్ట్ నుండి మాత్రం కోలుకోలేకపోయాడు.

ఏకంగా పంపిణీదారులు ఆయన ఇంటిముందు ధర్నా చేసే పరిస్థితి నెలకొంది. అప్పటికీ సంతృప్తిపడని ఈ బృందం ఈ సినిమాపై స్పూఫ్ ని తెరకెక్కించే పనిలో వున్నారట. ఈ సినిమాని మోసి బాగా నష్టపోయిన పంపిణీదారుడు సింగాలరేవన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. తమిళ కామెడి స్పూఫ్ సినిమాలు తీసే శ్రీనివాసన్ ని హీరోగా ఎంచుకున్నట్టు సమాచారం.

Exit mobile version