తమిళ వంద కోట్ల ప్రాజెక్ట్ రిలీజ్ డేట్..!

Puli
తమిళ సూపర్ స్టార్ విజయ్, శృతి హాసన్ జంటగా నటించిన భారీ చిత్రం ‘పులి’. ‘జిల్లా’, ‘కత్తి’ లాంటి రెండు వరుస బ్లాక్‌బస్టర్ సినిమాల తర్వాత విజయ్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ వంద కోట్ల బడ్జెట్ సినిమా పట్ల అంతటా భారీ క్రేజ్ ఉంది. చింబు దేవన్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో హన్సిక మరో హీరోయిన్‌గా నటించింది.

ఇక ఇప్పటికే దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్‌పై ఆధారపడి తెరకెక్కిన ఈ సినిమా విషయంలో దర్శకుడు శ్రద్ధగా విజువల్ ఎఫెక్ట్స్ పనులు పూర్తి చేయిస్తున్నారట. ఈ మధ్యే విడుదలైన పులి పోస్టర్స్, టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. ఇక ఆగష్టు 2న ‘పులి’ ఆడియో రిలీజ్ జరగనుండగా, వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 17న సినిమా విడుదల కానుంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ సినిమా ఒకేసారి విడుదల కానుంది.

Exit mobile version