మూడో సారి అల్లు అర్జున్ తో ఛాన్స్ కొట్టేసిన హాట్ బ్యూటీ.!

Allu-arjn
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘ఇద్దరమ్మాయిలతో’ సినిమాలో హాట్ హాట్ గా కనిపించి తెలుగు ప్రేక్షకులను ఆకర్షించిన హాట్ బ్యూటీ కేథరిన్ ట్రేస. ఈ సినిమాలో అల్లు అర్జున్ – కేథరిన్ కెమిస్ట్రీ కి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఈ సినిమా తర్వాత వీరిద్దరూ భారీ పీరియాడికల్ ఫిల్మ్ రుద్రమదేవిలో కలిసి నటించారు. రుద్రమదేవిలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. గోనగన్నా రెడ్డి పాత్రకి జోడీ అయిన అనామిక దేవి పాత్రలో కేథరిన్ కనిపించనుంది.

తాజా సమాచారం ప్రకారం ముచ్చటగా మూడో సారి ఈ జంట జోడీ కట్టనుంది. అల్లు అర్జున్ తదుపరి సినిమా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో ఉంటుంది. ఇద్దరు హీరోయిన్స్ ఉండే ఈ సినిమా కోసం ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ ని ఖరారు చేసారు. తాజాగా మరో హీరోయిన్ గా కేథరిన్ ట్రేస ని ఫైనలైజ్ చేసారని సమాచారం. బోయపాటి చెప్పిన కథ నచ్చడంతో కేథరిన్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడుతుంది. జూలై 17 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించనున్న ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్.

Exit mobile version