
టాలీవుడ్ హ్యాండ్సమ్ విలన్లలో ఒకరైన సోనూ సూద్ తెలుగులోనే కాక బాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా ఫేమస్ అయ్యాడు. అతడు, దూకుడు సినిమాలలో ఎంటర్టైన్మెంట్ కి సరిపోయే విలన్ గా నటించినా అరుంధతి, జులాయిలో టాలెంట్ ని చూపించాడు.
ఇటీవలే ఐ.ఐ.ఎఫ్.ఏ అవార్డ్ సెర్మనీ మలేసియాలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు హోస్ట్ లు గా వ్యవహరించిన రన్వీర్ సింగ్, అర్జున్ కపూర్ లు సోనూ సూద్ ని ప్రత్యేకంగా వేదికపైకి ఆహ్వానించి చొక్కా వెనుకనున్న సిక్స్ ప్యాక్ ని బయటపెట్టమనడం, సోనూ ఆలస్యం చేయకుండా తన ఆరుపలకల దేహం చూపించడం విశేషం.