సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న సీనియర్ నిర్మాత ఆర్.బి. చౌదరి నేడు ఉదయ్‌పూర్ సమీపంలో జరిగిన కారు ప్రమాదంలో మరణించారు. ఈ విషాద వార్తతో యావత్ సినీ ప్రపంచం దిగ్భ్రాంతికి లోనైంది.
రాజస్థానీ కుటుంబానికి చెందిన చౌదరి, మాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించి, ఆపై తెలుగు, తమిళ భాషల్లో అగ్ర నిర్మాతగా ఎదిగారు. సూర్యవంశం, సుస్వాగతం, రాజా, నిన్నే ప్రేమిస్తా, సింహరాశి, సంక్రాంతి, గాడ్‌ఫాదర్ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను ఆయన నిర్మించారు.
తమిళ హీరో జీవా తండ్రి అయిన ఆర్.బి. చౌదరి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఒక గొప్ప నిర్మాతను కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము.
