ఆదిత్య మ్యూజిక్ ద్వారా ‘శ్రీమంతుడు’ ఆడియో!

mahesh-sri
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘శ్రీమంతుడు’ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీస్ పతాకంపై రూపొందిన ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ముందు ప్రకటించినట్లుగానే ఈనెల 18న దేవీశీప్రసాద్ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఆడియోను రిలీజ్ చేయనున్నారు.

హైద్రాబాద్‌లోని శిల్పకళావేదికలో ఆడియో ఆవిష్కరణ వేడుకను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక శ్రీమంతుడు ఆడియోను ప్రముఖ మ్యూజిక్ సంస్థ ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల కానుంది. భారీ అంచనాల మధ్య విడుదల కానున్న ఈ సినిమా ఆడియోను ఫ్యాన్సీ ధరకు ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక దేవీశ్రీ అందించిన ఆడియోతో పాటు థియేట్రికల్ ట్రైలర్ కూడా ఆడియో రిలీజ్ సందర్భంగానే విడుదల కానుంది. మహేష్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగష్టు 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే!

Exit mobile version