నయనతార సినిమా ఆడియో విడుదల వివరాలు

Nayanatara
తమిళనాట నయనతార ‘మాయ’ అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసినదే. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలలో బిజీగా వుంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఆడియోని ఈ నెల 13న విడుదలచేయనున్నారు.

తెలుగులో ఈ సినిమా ‘మయూరి’ పేరుతొ అనువాదం కానుంది. ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ ఈ చిత్ర అనువాద హక్కులను సొంతం చేసుకున్నారు. తమిళనటుడు ఆరి ముఖ్యపాత్ర పోషించనున్నాడు. ఈ సినిమా ఈ నెల 24న విడుదలచేయనున్నారు.

Exit mobile version