
తెర మీద నుంచి మన కళ్ళు తిప్పితే ఏం మిస్ అయిపోతామో అనేలా ఉండే భారీ సెట్స్, ఇండియన్ స్క్రీన్ పై మునుపెన్నడూ చూడని విజువల్స్, హాలీవుడ్ ని తలపించే ఓ వార్ ఎపిసోడ్.. ఇన్ని అనుభవాలను ఒకేసారి కలిగించే సినిమా ‘బాహుబలి’. మాస్టర్ మైండ్ ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రలు పోషించారు. ప్రీమియర్ షోస్ నుంచే ఈ సినిమా అన్ని ఏరియాల్లోనూ కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ సృష్టిస్తోంది. భాషా భేదం లేకుండా ప్రతి భాషలోనూ ఈ సినిమా సూపర్బ్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది.
ఆంధ్ర – తెలంగాణలో కలుపుకొని మొదటి వీకెండ్ సుమరు 41 కోట్ల షేర్ సాధించింది. అలాగే ఒక్క హిందీలో మూడు రోజుల్లో 22.4 కోట్ల షేర్ సాధించింది. మిగిలిన భాషల్లో కూడా రికార్డ్ స్థాయి కలెక్షన్స్ ని నమోదు చేసింది. బాహుబలి ఫస్ట్ వీకెండ్ ఆంధ్ర, తెలంగాణలో ఏరియా వైజ్ కలెక్ట్ చేసిన షేర్ వివరాలు మీకోసం..
| ఏరియా | కలెక్షన్స్(షేర్) |
| నైజాం | 13.60 కోట్లు |
| సీడెడ్ | 9.00 కోట్లు |
| నెల్లూరు | 1.59 కోట్లు |
| గుంటూరు | 3.97 కోట్లు |
| కృష్ణా | 2.43 కోట్లు |
| పశ్చిమ గోదావరి | 3.54 కోట్లు |
| తూర్పు గోదావరి | 3.48 కోట్లు |
| వైజాగ్ | 3.42 కోట్లు |
| మొత్తం | 41.03 కోట్లు |