తమిళ్లో ‘బాహుబలి’ ఎంత కలెక్ట్ చేస్తుందంటే.!

baahubali-b
మాహిష్మతి అనే ఓ రాజ్యం, దాని కోసం పెద్ద పెద్ద కోటలు, భారీ భారీ సెట్టింగ్స్, రానాది 100 అడుగుల విగ్రహం, మహిష్మతిపై దండెత్తే కాలకేయ సైన్యం, ఇరు వర్గాల మధ్య వచ్చే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్.. ఇలా ఇన్ని అబ్బురపరిచే థ్రిల్స్ ని క్రియేట్ చేసింది టాలీవుడ్ మాస్టర్ మైండ్ రాజమౌళి. ఆయన చేసిన బాహుబలి సినిమాలో మీరు ఇవన్నీ చూసి థ్రిల్ ఫీలవ్వచ్చు. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కలిసి నటించిన ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళ హిందీ భాషల్లో రిలీజ్ అయ్యి ప్రతి చోటా రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తోంది. తెలుగులో ఇప్పయికే టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డ్ ని బ్రేక్ చేసి నెంబర్ 1 ప్లేస్ కి వెళ్ళింది.

ఇదిలా ఉంటే తమిళంలో కూడా సూపర్బ్ కలెక్షన్స్ రాబట్టుకుంటోంది. మొదటి మూడు రోజుల్లో 17 కోట్ల షేర్ కలెక్ట్ చేసిన బాహుబలి నాల్గవ రోజుతో సుమారు 20 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. వీక్ డే లలో కూడా స్ట్రాంగ్ రన్ ఉందని అక్కడి థియేటర్ యాజమాన్యం చెబుతున్నారు. తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా బాహుబలి కలెక్షన్స్ విషయంలో చాలా హ్యాపీగా ఉండడమే కాకుండా ఓవరాల్ గా బాహుబలి తమిళ్ లో 40 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుందనే ధీమాని వ్యక్తం చేసారు. మరోవైపు హిందీలో కూడా 40 కోట్ల మార్క్ ని ఈజీగా క్రాస్ చేస్తుందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.

Exit mobile version