2015మొదటిభాగామంతా కాస్త చప్పగా సాగినా చివర్లో డైనోసార్ లాంటి బాహుబలి రిలీజ్ తో మొత్తం గతం గతః అయిపొయింది. ఇక ఈ విజయం అందించిన స్పూర్తితో వరుసపెట్టి పెద్ద సినిమాలు ద్వితీయార్ధంలో విడుదలకానున్నాయి. ఫస్ట్ హాఫ్ లో ఒకటే విడుదలైన మెగా హీరోల చిత్రాలు సెకండ్ హాఫ్ లో మూడు రానుండడం విశేషం.
బన్నీ సత్యమూర్తిగారబ్బాయిగా అభిమానులను మెప్పించడంలో విఫలమయ్యాడు. కాకపోతే ద్వితీయార్ధంలో మెగా ఫ్యామిలీ ట్రీట్ మామూలుగా ఉండేలా లేదు. వరుణ్ తేజ్ నటించిన కంచె సినిమా అక్టోబర్ 2కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అదే నెలలో పూరీ – వరుణ్ తేజ్ ల లోఫర్ కూడా విడుదల అయ్యే చాన్సులు ఉన్నాయి. చెర్రి – శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న సినిమాకి మొదటినుండి అక్టోబర్ రిలీజ్ అని చెప్తున్నారు.
